ప్రజా సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు…

harish rao

Advertisements

&NewLine;<p>ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ&comma; పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు&period; సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని&comma; తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని వ్యాఖ్యానించారు&period; తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు&period; ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారని&comma; మనకంటే బాగా పని చేయాలని కోరుకుందామని వ్యాఖ్యానించారు&period; కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు&period; ప్రజా సమస్యలపై పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని&comma; ఆ అవకాశం మనకు ఉందన్నారు&period; కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని&comma; ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని&comma; అందరం కలసి పని చేద్దామన్నారు&period; ఓటమిపై సమీక్ష జరుపుకుందామని&comma; తప్పొప్పులు సరిచేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.