109
పండుగ నేపథ్యంలో ఎక్కడికక్కడ కోడి పందేలు, గుండు ఆటలు జోరుగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజక వర్గం వ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. బరుల్లో గుండు ఆటలు జోరుగా సాగుతున్నాయి. పోలీస్ వారు ఎంత హెచ్చరించిన పందేలు కొనసాగించడం లో రాజకీయ నాయకులదే పై చేయి అయ్యింది. కొన్ని చోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఈ పందేల నేపథ్యంలో కోట్ల రూపాయలు చేతులు మరుతునట్లు సమాచారం. పందాల్లో కోడి కి కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు.