54
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మునిసిపల్ కార్మికులు మోకాళ్ళ దండ వేసి నిరసన తెలిపారు. స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద టెంట్ వేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారం లోకి రాకముందు తమను శాస్విత ప్రాతిపదికన నియమిస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారం లోకి వచ్చి 5 వ ఏడు పూర్తి కావస్తున్నా హామీలు నెరవేర్చలేదని అన్నారు. హామీకి విరుద్ధంగా అప్కాస్ అనే శాస్విత కాంట్రాక్టు వ్యవస్థను తమ పైన రుద్దిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.