నీళ్లు వృధా చేసిన దౌర్భాగ్యుడు….

Chilli fields should be watered

Advertisements

&NewLine;<p>పెద్దవడుగూరు మండల పొలాలకు నీళ్లు ఇవ్వాలని మిర్చి రైతులతో కలిసి మిడుతూరు వద్ద బెంగళూరు &&num;8211&semi; హైదరాబాద్ జాతీయ రహదారిని తాడిపత్రి టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి గారు&comma; జెసి ప్రభాకర్ రెడ్డి గారు దిగ్భంధించారు&period; ఈ సందర్భంగా జెసి అష్మిత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మిర్చి రైతులకు నీళ్లు ఇవ్వకపోతే వాళ్లకు ఆత్మహత్యే శరణమని ఆయన అన్నారు&period; అధికారులు మేల్కొని కాలువకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని అన్నారు&period; ఇసుక దోపిడీ చేయడం కోసం నీళ్లు వదులుతారు కానీ పంటలకు నీళ్లు ఇవ్వాలని అడిగితే మాత్రం వదలరు అని బాధపడ్డారు&period; తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి లేదని ఇసుక దోపిడీ కోసం 7 టీఎంసీల నీళ్లు వృధా చేసిన దౌర్భాగ్యుడు తాడిపత్రి ఎమ్మెల్యే అని ఆయన మండిపడ్డారు&period; పెద్ద వడుగూరు మండల పత్తి రైతుల్ని కాపాడలేకపోయారని కనీసం మిర్చి రైతుల పొలాలకు అయినా నీళ్లు వదిలి వీళ్ళను కాపాడండి అని ఆయన అన్నారు&period; పెద్దవడుగూరు రైతులతో పాలాభిషేకాలు చేయించుకున్న తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు మిర్చి రైతులను నట్టేట ముంచాడని ఎద్దేవా చేసారు&period; ఇప్పటికైనా నీళ్లు ఇచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని పత్తి&comma; మిర్చి రైతులకు సబ్సిడీ ఇవ్వాలని&comma; ఇవ్వని పక్షములో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు&period; రాబోవు కాలంలో కూడా రైతుకు అండగా నిలబడతామని రైతుల సాక్షిగా జెసి అష్మిత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్