తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు. నిరుద్యోగ యాత్ర పేరుతో యువత రాష్ట్రమంతటా పర్యటించి తెలంగాణా రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణా వచ్చిందే నీళ్లు, నియామకాల కోసమని, కానీ గులాబీ బాస్ ఆ రెండింటిని పూర్తిగా పక్కనపెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిరుద్యోగులు బస్సు యాత్ర చేయాలని తలపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రను ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా చేయలేదని మండిపడ్డారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిపినా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది మహిళలు, యువత కారణంగా అధికారంలోకి వస్తాయని చెప్పవచ్చు. కానీ కెసిఆర్ సర్కార్ యువత ఆశలను ఆడియాసలు చేయడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. వీరందరూ మూకుమ్మడిగా గ్రామాల్లో పర్యటించి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభావం తప్పకుండా కెసిఆర్ పై పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత
68
previous post