82
కరీంనగర్ జిల్లాలో నీటిపారుదలశాఖ కార్యాలయంలో కంప్యూటర్లు మాయమయ్యాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఆఫీసులో దొంగలు పడ్డారు. 5 కంప్యూటర్లు, ఇతర సామగ్రి దొంగిలించినట్లు సిబ్బంది గ్రహించారు. సుమారు రెండున్నర లక్షల విలువైన సొత్తు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ అయిన కంప్యూటర్లలో ఎల్ఎండీ ప్రాజెక్టు వివరాలతోపాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆ డాటా ఉన్న కంప్యూటర్లు మాత్రమే చోరీకి గురయ్యాయి. బీరువా పగలగొట్టిన దొంగలు పలు ఫైళ్లు కూడా అపహరించారు. కార్యాలయం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు.
Read Also..