దేవస్థానంలో చోరీ..

polaramma

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా కంకటపాలెం గ్రామంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీ చేశారు&period; దేవస్థానంలోని హుండీ తో పాటు అమ్మవారి బంగారు&comma; వెండి ఆభరణాలు దొంగతనానికి గురి అయినట్లు ఆలయ పూజారి బాపట్ల శేషగిరిరావు తెలిపారు&period;<br>సోమవారం వేకువజామున ఆలయం తెరవడానికి వచ్చిన పూజారి కి తాళాలు పగలగొట్టి ఉండటం తో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు&period; గ్రామ పెద్దలతో కలిసి పూజారి ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి గురి అయిన వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు&period; ఆలయంలో అమ్మవారి చీరెలు అమ్మగా వచ్చిన 15000 రూపాయలు కూడా హుండీలోనే వేశామని పూజారి చెబుతున్నారు&period; అమ్మవారి బంగారు కాసుల పేరుతో పాటు కళ్ళు&comma; చెవులు మిగిలిన ఆభరణాలు&comma; ఛటారితో సహా అపహరణ కు గురయ్యాయన్నారు&period; షుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆభరణాల విలువ ఉంటుంది అంటున్నారు&period; ఆలయంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.