అన్నమయ్య జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 చోరీ కేసుల్లో 7మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రూ.21,87,500 విలువ చేసే 437.76 గ్రాముల బంగారం, 417 గ్రాముల వెండి, ఒక కారు స్వాధీనం చేసుకొన్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు ఇపిఎస్ వివరాలు వెల్లడించారు. ఎస్పి కృష్ణ రావు తెలిపిన వివరాల మేరకు గుర్రం కొండ, పెద్దమండెం, తంబళ్ళ పల్లె, కలకడ, లక్కిరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు జరిగినట్లు కేసులు నమోదు చేయడం జరిగింది. దొంగతనాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు రాయచోటి డివిజన్ డి ఎస్పి మహబూబ్ బాష పర్యవేక్షణలో వాయిల్పాడు సి ఐ సురేష్ కుమార్, గుర్రంకొండ యస్ ఐ దిలీప్ కుమార్ లు రెండు టీంలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలు జరిగిన ప్రదేశాలలో సి సి కెమెరా పుటేజ్ ద్వారా ఫోటోలు సేకరించారు. ఇదే తరహాలో గతంలో రాయచోటి లో కుడా దొంగతనాలు జరిగినట్లు కుడా వారు తెలియజేశారు. సి సి పుటేజి ల ద్వారా సేకరించిన ఫోటోల ఆధారంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి విచారించామన్నారు. ఆ విచారణలో అన్నమయ్య జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో కేసు నమోదైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్తికేయన్, మురగేంద్రన్, మోహన్ రాజ్, శక్తివేల్, మురళి, దినకరన్, పి తిరుపతి, వెంకటేష్ లను అరెస్ట్ చేశామన్నారు. వారు దొంగతనాలు చేసేందుకు వాడిన పనిముట్లు, రెండు పల్సర్ బైక్ లు, ఆరు సెల్ ఫోన్ లను సిజ్ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా వారు కొల్లగొట్టిన వెండి, బంగారు నగలను రికవరీ చేసి విధి నిర్వహణలో ఉత్తమమైన విధులను నిర్వర్తించి పోలీసుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించేలా చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ ప్రశంసించి వారికీ రివార్డులు అందజేశారు.
అన్నమయ్య జిల్లాలో దొంగల అరెస్ట్…
113
previous post