అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ ఫాం హౌస్ (Kanekal Crossing Farm House) లో శనివారం రాత్రి దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు కనేకల్ క్రాస్ లోని వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముఖంకు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి కుటుంబ సభ్యులను తుపాకులు, నాటు కొడవళ్ళతో బెదిరించి ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోపిడీ చేసిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు ఇంట్లోని కుటుంబ సభ్యులందరి వంటిపై ఉన్న 10 తులముల బంగారు నగలు, రూ 38,500 నగదు దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులను ఇంటిలో వేసి తలుపులకు గడియ పెట్టి హుడాయించారు. వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను పగలగొట్టి చీకట్లో పడేశారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు.
ఇది చదవండి: రోడ్డు దాటడానికి తంటాలు పడిన ఒంటరి ఏనుగు..
Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసంఇక్కడక్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి