డ్యామ్ భద్రతకు పెను ముప్పు…

nagarjuna sagar

Advertisements

&NewLine;<p>డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్&lpar;Nagarjuna sagar&rpar;&comma; శ్రీశైలం రిజర్వాయర్&period;&period; పొంచి ఉన్న తాగునీటి గండం&excl;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది&period; దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది&period; సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు&comma; ఉమ్మడి నల్లగొండ&comma; ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px"><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><strong> మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నాగార్జునసాగర్&lpar;Nagarjuna sagar&rpar; రిజర్వాయర్ లో నీటిమట్టం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్&lpar;Nagarjuna sagar&rpar; రిజర్వాయర్ లో ప్రస్తుతం 511 అడుగుల నీటిమట్టంతో 133&period;7 టీఎంసీల నీరు ఉంది&period; సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు 131 టీఎంసిలుగా నిర్ణయించడం జరిగింది&period; అయితే డెడ్ స్టోరేజ్ కి కేవలం మూడు అడుగుల దూరంలోనే ఉంది సాగర్ డ్యామ్&period; దీంతో నాగార్జునసాగర్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి&period; గత ఏడాది ఇదే సమయంలో 528&period;30 అడుగులతో 164 టీఎంసీల నీరు ఉంది&period; గత ఏడాదితో పోల్చితే నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో 31 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది&period; గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న నాగార్జునసాగర్ తీవ్ర వర్షాభావంతో వట్టి పోయింది&period; ఆశించిన స్థాయిలో వర్షాలు లేక సాగర్ నిండుకుంటోంది&period; దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్&comma; రబీ సీజన్ లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది&period; మరోవైపు వేసవి కాలం ప్రారంభం కావడంతో సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు&comma; ఖమ్మం&comma; ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నీటి మంచినీటి ఎద్దడి తీవ్రమవుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h2 class&equals;"wp-block-heading">తాగునీటికి ప్రమాదం…<&sol;h2>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాగార్జునసాగర్&lpar;Nagarjuna sagar&rpar; రిజర్వాయర్ నుండి హైదరాబాద్ జంట నగరాలు ఉమ్మడి నల్లగొండ&comma; ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది&period; నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు&period; సాగర్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్ కు పంపింగ్ చేస్తున్నారు&period; ఇక్కడి నుంచి జంట నగరాలకు 550 క్యూసెక్కులు&comma; ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో తాగునీటికి ప్రమాదం పొంచి ఉంది&period; సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది&period; డెడ్ స్టోరేజీకి ఎగువన ఉన్న కేవలం రెండు టీఎంసీల&lpar;TMC&rpar; నీరు మాత్రమే ఉంది&period; ప్రస్తుతం అయితే ఏప్రిల్ నెల వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్లలో తాగునీటికి సరిపడా నీరు ఉంది&period; మే&comma; జూన్&comma; జూలై మూడు నెలలకు తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">జీరో లెవల్ నుంచి పుట్టంగండి వద్ద పంపింగ్<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హైదరాబాద్ జంట నగరాలకు మంచినీటి సరఫరాను ప్రస్తుతం పుట్టంగండి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతోంది&period; 510 అడుగుల డెడ్ స్టోరీకి దిగవకు నీటిమట్టం పడిపోతే పంపింగ్ కష్టమే అవుతుంది&period; నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినప్పుడు బ్యాక్‌ వాటర్‌ వద్ద జీరో పాయింట్ నుంచి డ్రెడ్జింగ్‌ ప్రక్రియతో భారీ మోటార్లతో పంపింగ్‌ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు&period; మరోవైపు 1450 కోట్ల రూపాయలతో సుంకిశాల వద్ద మూడోదశ పైపు పనులు కూడా కొనసాగుతున్నాయి&period; మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అత్యవసర పనులను చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరోవైపు ఏపీ తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు&period; దీంతో రెండు రోజుల్లో డెడ్ స్టోరేజ్ కి చేరుకునే ప్రమాదం ఉంది&period; భవిష్యత్ అవసరాలకు శ్రీశైలం&comma; జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే అవకాశం కూడా లేదు&period; ఇప్పటికే ఆ రెండు ప్రాజెక్టులు వట్టిపోయి ఉన్నాయి&period; మరో మూడు నెలల పాటు తాగునీటి అవసరాలు ఎలా తీర్చుకోవాలని దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డెడ్ లెవెల్‌కు చేరువలో శ్రీశైలం జలాశయం<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అటు నంద్యాల జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు త్రాగు నీరందించే శ్రీశైలం జలాశయం&lpar;Srisailam reservoir&rpar; ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోయి వెలవెలబోతుంది&period; తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన 215 టీఎంసీలకు గాను&period;&period; ఇప్పుడు మిగిలింది 34 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు&period; ఇక ఈ ఎండాకాల సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలసిన పరస్థితి ఏర్పడనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీశైలం జలాశయం&lpar;Srisailam reservoir&rpar;లో గత ఏడాది ఏప్రిల్ 8 ఇదే సమయానికి 805&period;80 అడుగులుగా 31&period;9380 టీఎంసీ నీరు ఉంది&period; అయితే ప్రస్తుతం నీటిమట్టం 810&period;70 అడుగులుగా ఉంది&period; శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు&period; కాగా ప్రస్తుతం 809&period;90 అడుగులుగా ఉంది&period; పూర్తిస్దాయి నీటి నిల్వ సామార్ద్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34&period;2438 టీఎంసీలుగా నమోదైంది&period; అయితే శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీరులేక అడుగంటిపోయింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక Aపై భారత్ A అద్భుత విజయం.

హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష.

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..