అనంతపురం జిల్లా గుత్తి మండలం తురక పల్లి గ్రామానికి చెందిన జయకృష్ణారెడ్డి ,పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ప్రశాంత్ నాయుడులతో నంద్యాల జిల్లా ప్యాపిలి గ్రామానికి చెందిన తొండపాటి సుధాకర్ మంచి స్నేహితులు అయితే వీరి స్నేహంలో డబ్బు లావాదేవీల విషయంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ప్యాపిలికి చెందిన సుధాకర్ జయ కృష్ణారెడ్డి, ప్రశాంత్ నుండి విడిపోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తారీఖున గుత్తి పట్టణ శివారులో సుధాకర్ ప్యాపిలి వైపు వెళ్తుండగా జయ కృష్ణారెడ్డి మరియు ప్రశాంత్ నాయుడు ఇద్దరు కలిసి సుధాకర్ ను అడ్డుకున్నారు. ఒకరు షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీయగా మరొకరు తుపాకీతో సుధాకర్ కు గురిపెట్టి చంపుతానని బెదిరించారు. అంతేకాకుండా 21వ తారీకు రాత్రి ప్రశాంత్ నాయుడు సుధాకర్ కు ఫోన్ చేసి డబ్బు ఇవ్వకపోతే నిన్ను తుపాకీతో కాల్చి చంపుతాను అంటూ హెచ్చరించాడు. దీంతో బాధితుడు గుత్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు Cr No: 297/2023 గా కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు గుంతకల్ డిఎస్పి నర్సింగప్ప ఆధ్వర్యంలో గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి తో పాటు సిబ్బంది శుక్రవారం ఉదయం పట్టణ శివారులోని బాటుసుంకులమ్మ ఆలయం సమీపంలో నిందితులైన ప్రశాంత్ నాయుడుతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్ రెడ్డి అనే ఇద్దరి యువకులను నిన్నటి దినం అరెస్ట్ చేయగా. ఈ కేసులో జార్ఖండ్ కు చెందిన శ్యామ్ సన్ , సుందర్ పాసియే తో పాటు తురకపల్లికి చెందిన జయ కృష్ణారెడ్డి ని గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్ రెండు మాక్సిన్ , ఐదు తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు గుత్తి సీఐ వెంకటరామరెడ్డి వెల్లడించారు.
తుపాకీతో బెదిరింపులు ..ముగ్గురి అరెస్ట్
73
previous post