90
గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బిసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యం గుర్తించడం జరిగిందని అన్నారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తీరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లూ విచారణలో వెల్లడైందన్నారు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డి ఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. పోలీసులకు రివార్డ్ లని డీఎస్పీ చేతుల మీదుగా అందించారు.