ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు – తప్పిన పెను ప్రమాదం

Vande Bharat Train

Advertisements

&NewLine;<p>ఒడిశాలోని రూర్కెలాలో ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు దూసుకొచ్చాయి&period; ఓ మెమూ రైలుకు ప్యాసింజర్ ట్రైన్ ఎదురెళ్లగా ఆ వెనకే వందేభారత్ ట్రైన్ దూసుకొచ్చింది&period; లోకోపైలట్లు అప్రమత్తం కావడంతో వంద మీటర్ల సమీపంలోకి వచ్చి రెండు రైళ్లు ఆగిపోయాయి&period; స్టేషన్ సిబ్బంది అలర్ట్ చేయడంతో సుమారు 200 మీటర్ల దూరంలో వందేభారత్ ట్రైన్ ఆగిపోయింది&period; దీంతో ఘోర ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు&period; అయితే&comma; ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు&period; సుందర్ గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది&period; సంబల్పూర్ &&num;8211&semi; రూర్కెలా మధ్య నడిచే మెమూ రైలు&comma; రూర్కెలా-జార్సుగూడ ప్యాసింజర్ ట్రైన్ ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి&period; చివరి నిమిషంలో గమనించిన లోకోపైలట్లు వెంటనే బ్రేక్ వేశారు&period; దీంతో వంద మీటర్ల చేరువలోకి వచ్చాక రైళ్లు ఆగిపోయాయి&period; దీంతో ప్రమాదం తప్పిందని భావించే లోపలే అదే ట్రాక్ పై పూరీ-రూర్కెలా వందేభారత్ దూసుకురావడం రైల్వే సిబ్బంది గమనించారు&period; వందేభారత్ లోకో పైలట్ కు సమాచారం అందించడంతో ఎమర్జెన్సీ బ్రేక్ అప్లయ్ చేసినట్లు సమాచారం&period; ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..