సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..

Advertisements

<p>తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు&period; తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు&period; అయితే&comma; ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎటువంటి పిలుపు రాకపోవడం ఉత్కంఠను పెంచుతోంది&period; ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది&period; అయితే&comma; ప్రధానమైన &OpenCurlyQuote;ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’&comma; &OpenCurlyQuote;యూనియన్ల పునరుద్ధరణ’ అనే రెండు డిమాండ్ల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు&period; ఈ రెండూ మినహా మిగిలిన అన్నింటిపై సానుకూలత వ్యక్తం చేసినా&comma; జేఏసీ నేతలు మాత్రం తమ పట్టు వీడటం లేదు&period; సమ్మె అనివార్యమైతే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది&period; ప్రైవేట్ డ్రైవర్లను సిద్ధం చేయడం&comma; అద్దె బస్సులను నడపడం వంటి అంశాలపై రవాణా శాఖ దృష్టి సారించింది&period; ఈ క్రమంలోనే&comma; రేపు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది&period; ఈ సమావేశం సఫలమైతేనే సమ్మె విరమణ దిశగా అడుగులు పడతాయి&comma; లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..