బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద ఇద్దరు వ్యక్తులు యువకుడి పై దాడికి పాల్పడ్డారు. వన్ టౌన్ కు చెందిన సాయి కుమార్ బెంజ్ సర్కిల్ వైపు వస్తున్నాడు. కృష్ణలంకకు చెందిన ఆడపాల నాగేంద్ర, కంకిపాడుకు చెందిన దేవరపల్లి విజయకుమార్ లు ఒకే బైక్ పై వెళ్తూ బెంజ్ సర్కిల్ సిగ్నల్ సమీపంలో రోడ్డుపై గొడవ పడుతున్నారు. ఈ సమయంలో సాయి వచ్చి వారిని బైక్ పక్కకు తీయమనడం.. వారు పక్కన నుంచి వెళ్లు అనడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది. వాగ్వాదం పెరగడంతో సాయి పై నాగేంద్ర, విజయకుమార్ కలిసి దాడి చేసారు. ఇద్దరు యువకులు దాడి చేస్తున్న పోలీసులు అటు వైపు కన్నెతైనా చూడలేదు. స్థానికులు జోక్యం చేసుకొని ట్రాఫిక్ పోలీసులను వివాదం ఆపండి అని చెప్పడంతో పోలీసులు అప్పుడు స్పందించారు. మాచవరం పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెంటనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..
97