అతని పాలనలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు…

Koramutla Srinivas

Advertisements

&NewLine;<p>అవ్వా తాతలు&comma; వితంతువులు&comma; వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని&comma; ఈ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్&comma; శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు&period; రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన రైల్వే కోడూరు మండల పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు&period; రైల్వే కోడూరు మండలంలోనే సుమారు 11 వేలుకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు&period; నెలకు పెన్షన్ల క్రింద రైల్వే కోడూరు మండల పరిధిలో రూ&period;10 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు&period; గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు&period; జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు&period; గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు&period; చంద్రబాబు పాలనలో చట్టబద్దత లేని జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు&period; జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు&period; అధికారమే పరమావధిగా చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో&comma; దుష్టచతుష్టయం తో పావులు కదుపుతున్నారన్నారు&period; పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు&period; అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ తో పాటు స్వీట్స్ అందజేయడం జరిగింది&period; ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి&comma; జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి&comma; ఏపీ టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి&comma; మందల నాగేంద్ర&comma; మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు&comma; ఉప సర్పంచ్ తోట à°¶à°¿à°µ సాయి&comma; పట్టణ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.