65
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. తన సీటుపై తానేమీ చెప్పలేనని సీఎం స్పష్టత ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. మైలవరంలో పోటీపై త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తానన్నారు. వచ్చే నెల 4 లేదా 5న ప్రెస్‍మీట్ పెట్టి తన మనోభావాలను తెలియజేస్తానన్నారు. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గొంతులో వెలక్కాయ పడ్డట్లు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధికి నిధులు లేవని తెలిపారు. సీఎం అనుకున్న సంక్షేమ పథకాలు వందశాతం అమలు అవుతున్నాయన్నారు. తినగా తినగా పంచదార చేదు అన్నట్లుగా సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరి హక్కు అయ్యాయన్నారు. ప్రజలు పథకాలు కాదు అభివృద్ధి కావాలంటున్నారంటూ పేర్కొన్నారు.