కొయ్యురు కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలతో పాఠశాల యాజమాన్యం వెట్టిచాకిరి పనులు చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ అచ్యుత్ కస్తూరిబా పాఠశాలను సందర్శించి స్కూల్ ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థునిలతో వెట్టిచాకిరి అని వచ్చిన వార్త వాస్తవమేనని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ మెంబర్ గొండు సీతారాం ఆదేశాల మేరకు కొయ్యూరు కేజీబీవీ పాఠశాలను సందర్శించినట్లు అచ్యుత్ తెలిపారు. అయితే ఈ విషయమై ప్రిన్సిపాల్ పరిమళ ను అడుగగా ఆ ఫోటో ఇప్పటిది కాదని బహుశా ఆమె ప్రిన్సిపాల్ గా రాక ముందు తీసిన ఫోటో అయి ఉండొచ్చని ఆమె తెలిపారు. కానీ విద్యార్థినిలను అడుగగా రెండు వారాలు అవుతుందని వారు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన ఆదివారం కిచెన్ నుండి డైనింగ్ హాల్ వరకు అన్నం ఉన్న దబరాలను వర్కర్లు విద్యార్థినిలతో మోయించినట్లు తెలిపారు. దబరాను మోసుకొని వెళ్ళిన విద్యార్థినిలు 6వ తరగతి విద్యార్థిని ఒకరు కాగా, మరొక ఇద్దరు 7వ తరగతి చదువుతున్నట్లు ఆ విద్యార్థినులు తెలిపారు. ఆ పాఠశాలలో ఇటువంటి పనులు అప్పుడప్పుడు చేయడం వాస్తవమే అని విద్యార్థునిలు ద్వారా తెలిసినట్లు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ తెలిపారు. అచ్యుత్ తో పాటు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రాజు, మహిళా పోలీస్ నారాయణమ్మ పాల్గొని విషయం తెలుసుకున్నారు.
కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలతో వెట్టిచాకిరి…
93
previous post