డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Advertisements

<p>తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు&period; హైదరాబాద్ నగరంలో పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు&period; ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దని అన్నారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి&period; తాను వెళుతున్న క్రమంలో&comma; ట్రాఫిక్ నిలిపివేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున ఆగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు&period; తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని అన్నారు&period; కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నించారు&period; అలా చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు&period; విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.