ఇంధన పొదుపు భవితకు భరోసానన్నారు జేసి ఫర్హాన్ అహమ్మద్, ఎ పి ఎస్ పి డి సి ఎల్ జిల్లా ఇంచార్జి అధికారి చంద్ర శేఖర్ రెడ్డి లు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఎ పి ఎస్ పి డి సి ఎల్ కార్యాలయం నందు జిల్లా అధికారి చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలిలో అన్నమయ్య జిల్లా జేసి ఫర్హాన్ అహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ర్యాలిలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంధనం పొదుపు చేయాలంటూ నినాదాలు నిర్వహిస్తూ విద్యుత్ కార్యాలయం నుండి శివాలయం చెక్ పోస్ట్ సర్కిల్, యస్ యన్ కాలని మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కుడా డిసెంబెర్ 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క వారోత్సవాలలో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇంధనం దుర్వినియోగం చేయకుండా ఎలా ఆదా చేయాలనే విధంగా పలు రకాల అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాంద్ భాషా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నరేంద్ర నాథ్ రెడ్డి, వై నాగరాజు, నరేష్, గిరిధర్, రాజేష్, ఇతర అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
విద్యుత్ వృధా చేయడం ఒక సామాజిక రుగ్మత…
58
previous post