పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామం లో రైల్వే గేటు వున్నది, దాచేపల్లి నుండి వినుకొండ ప్రధాన రహదారి అవ్వడం వలన నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది, ఈ గేటు నుండి నిత్యం కొన్ని వేల వాహనాలు వెళ్తు ఉంటాయి. అయితే ఈ గేటు వలన వాహన దారులు ప్రతి రోజు ఇబ్బంది పడటం వలన ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణం చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది, భూసేకరణ పనులు మొదలు పెడుతున్నారని తెలిసి కేసానుపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకి దిగారు. గత 50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే కొన్ని వందల కుటుంబాలు ఇల్లు కోల్పోయి రోడ్డున పడతయాని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులు మావి, మేము ఇల్లు కోల్పోతే ఎక్కడ ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం కాకుండా అండర్ బ్రిడ్జ్ వేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం లేదంటే ఆత్మహత్యలకు సిద్ధమంటున్న కేసానుపల్లి గ్రామస్తులు.
ఫ్లై ఓవర్ మాకొద్దు అండర్ బ్రిడ్జి కావాలి..
76
previous post