మరో రెండు రోజుల్లో అండమాన్ను తాకనున్న రుతుపవనాలు..

మరో రెండు రోజుల్లో అండమాన్ను తాకనున్న రుతుపవనాలు

Advertisements

<p>నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ లక ప్రకటన చేసింది&period; రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది&period; మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు&period;&period; అండమాన్‌ను తాకనున్నాయని&period;&period; ఈ నెలాఖరులోపే కేరళంలోకి రుతు పవనాలు ప్రవేశించనుందని వెల్లడించింది&period; 16&comma; 17 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతం&comma; అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది&period; ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతం&comma; అండమాన్ సముద్రం&comma; అండమాన్ నికోబార్ దీవులలో నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది&period; సాధారణంగా నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు మే 15 నాటికి ప్రవేశిస్తాయి&period;&period; అలాగే మే 20 నాటికి అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయి&period; ఈ ఏడాది రుతుపవనాల రాక ఈ కాలక్రమానికి అనుగుణంగానే ఉండబోతోందని ఐఎండీ పేర్కొంది&period; దక్షిణ అండమాన్ సముద్రంపై రుతుపవనాల రాక దాదాపు షెడ్యూల్ ప్రకారమే ఉన్నట్లు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు&period;<&sol;p>&NewLine;<p>గతేడాది నైరుతి రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే ముందే&period;&period; అంటే మే 13 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం&comma; ఆగ్నేయ బంగాళాఖాతం&comma; నికోబార్ దీవులకు చేరుకున్నాయి&period; వాతావరణ రికార్డుల ప్రకారం&period;&period; నైరుతి రుతుపవనాలు మే 20 నాటికి అండమాన్ సముద్రాన్ని కవర్ చేసి&period;&period; జూన్ 1 నాటికి కేరళం తీరాన్ని తాకుతాయి&period; అయితే&comma; 2026 నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..