కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టునూ అప్పగించలేదు. ఎటువంటి అంగీకారం తెలపలేదు ఏ ఒప్పందంపైనా సంతకం చేయలేదు. ప్రాజెక్టులు స్వాధీనం చేశారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. గతంలోనూ ఒకసారి ఇదే తీరులో ప్రచారం జరిగింది’ అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గత నెలలో కేంద్రంతో జరిగిన సమావేశంలోగానీ, బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోగానీ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదని తెలిపారు. ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీల నేతలు వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ, తెలంగాణల సమావేశం జరిగింది. దానికి కొనసాగింపుగానే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారని రాహుల్ బొజ్జా తెలిపారు. త్రిసభ్య కమిటీ భేటీలో ఈఎన్సీ కొన్ని షరతులు పెట్టారు. కేంద్రానికి రాష్ట్రం రాసిన లేఖను అందజేశారు. శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న 15 అవుట్‌లెట్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగిలిన పది అప్పగింతకు ప్రభుత్వం అనుమతి పొందాల్సిన అవసరం ఉందని వివరించారు.
కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టులు అప్పగించలేదు..!
58
previous post