114
ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలో అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకు రావడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చింది. ఆ నిధులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.