ప్రభుత్వాన్నే మార్చేసిన ఆ పాట ఏంటి ?

KTR who participated in the program of spiritual honor

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు&period; జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు&period; బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్ ల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు&period; అనంతరం&comma; సర్పంచ్ లకు చేసిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ &period; &period; &period; పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశాం&period; పదవులు వస్తాయి&comma; పోతాయి అంతేకాని శాశ్వతం కాదు&period; పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యం&period; పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే&comma; ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారు&period; ఓ కవి రాసిన పాట&comma; పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది&period; తెలంగాణ లో లాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్&comma; పల్లెప్రకృతి వనం&comma; వైకుంఠధామాలు&comma; ట్యాంకర్ లు&comma; ట్రాక్టర్లు&comma; నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేశానన్నారు&period; సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానన్నారు&period; 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయి&period; దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు&period; ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకం లో దేశంలోనే టాప్ ట్వంటీ లో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమని సర్పంచ్ ల పనితీరును కొనియాడారు&period; పెండింగ్ బిల్లుల సమస్య పై మీ తరుపున ప్రభుత్వం తో మాట్లాడడానికి&comma; గొంతు విప్పడానికి నేను సిద్దంగా ఉన్నానని ధీమాను ఇచ్చారు&period; దేశంలో చెక్ పవర్ ఉన్నది సర్పంచ్ లకు&comma; రాష్ట్రపతికి మాత్రమే అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్