పల్నాడుజిల్లా నరసరావుపేటలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో కోడిపుంజుల కొట్లాట ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యా సంస్థలే వారిని పక్కదారి పట్టించే వైనం చేశారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాత్రి సంబరాల్లో నిషేధించబడిన కోడి పందాలు ప్రదర్శనతో నివ్వెర బోయిన తల్లిదండ్రులు, ఇప్పటివరకు రహస్యంగా ఎక్కడో నిర్వహించే కోడిపందాలని విద్యాలయంలో విద్యార్థుల ఎదుటనే ప్రదర్శించటం అమానుషం గా ఏర్పడింది. వైసిపి నాయకులు అండదండలు ఉన్న కారణంగా దీనిపై పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం, దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ కి వివరణ కోసం ఓ విలేఖరి ఫోన్ చేయగా ప్రిన్సిపాల్ సానుకూలంగా స్పందించి, కోడిపందాల ప్రదర్శన మేము చేపించలేదు స్కూల్ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి మాగులూరి రమణారెడ్డి చేపించారంటూ ప్రిన్సిపల్ అన్నారు. సదురు స్కూల్ డైరెక్టర్ నాకు కాల్ చేసి నాతో ఎలా పడితే అలా మాట్లాడి నీ అంతు చూస్తానంటూ, 10 మందిని రౌడీలను పంపించి నిను చంపుతాను అంటూ నాకు బెదిరింపులకు గురి చేశారన్నారు. విలేఖరివైతే ఎవరికి ఎక్కువ అంటూ ఫోన్లో ఎలా పడితే అలా దుర్భాషలాడి, దీనిపై వార్త రాస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. స్కూల్ డైరెక్టర్ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు.. జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిలపై చర్యలు తీసుకోవాలని DSP కి ఫిర్యాదు చేసిన జర్నలిస్టుల సంఘం.. జర్నలిస్ట్ లపై దాడికి పాల్పడినా, దుర్భాషలాడిన కఠిన చర్యలు తప్పవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించినప్పటికి కూడా జర్నలిస్టులపై ఆగని దాడులు, దీనిపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట జర్నలిస్ట్ సంఘం తరుపున తెలియజేశారు.
విలేఖరివైతే ఎవరికి ఎక్కువ..
73
previous post