రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఏ రాజకీయ పార్టీ అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే పార్లమెంటు ఎన్నికల్లో రైతులు ఓటు వేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతులతో, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఆయన వారితో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి తెచ్చుకుందామని ఈ సందర్భంగా శ్రీహరి రావు రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రలలో పంటల బీమా పథకాన్ని అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని, మొత్తం ప్రీమియం కేంద్ర ప్రభుత్వమే కట్టుకోవాలన్నారు.
మీకు ఎవరు మంచి చేస్తారో..! వాళ్ళకే మీ ఓటు
87
previous post