మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు. అదే విధంగా రైతు సంఘాల పోరాటానికి, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్ లోని యోగి మల్లవరం బ్రిడ్జి దగ్గర ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో కర పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని, ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక మధ్య పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం. తలవంచిందని చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనకు, బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నగర అధ్యక్షులు కేవైసీ రాజా ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆ రెండు ప్రభుత్వాలకు ఓటు అనే ఆయుధంతో…
83
previous post