ఈ సాల కప్ నందే… కప్ గెలిచాం

Women's Premier League champions Royal Challengers Bangalore

Advertisements

&NewLine;<p>ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది&period; ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది&period; తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి టైటిల్ కైవసం చేసుకుంది&period; కాగా&comma; ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18&period;3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది&period; ఢిల్లీ బ్యాటర్లలో మెక్ లానింగ్ 23&comma; షెషాలీ వర్మ 44&comma; రాధా 12&comma; అరుంధతి రెడ్డి 10 పరుగులు చేయగా&period;&period; మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది&period; ఆర్సీబీ బౌలర్లలో మోలినెక్స్ 3&comma; శ్రేయాంక పాటిల్ 4&comma; ఆశా శోభనా 2 వికెట్లు తీశారు&period; అనంతరం 114 పరుగుల మోస్తారు లక్ష్యంతో చేదనకు దిగిన ఆర్సీబీ 19&period; 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి డబ్ల్యూపీఎల్‌లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది&period; కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధన 31 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించింది&period; రిచా ఘోష్ 17&comma; సోఫియా డివైన్ 32&comma; స్టార్ ఆల్ రౌండర్ అలెస్సా పెర్రీ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది&period; ఢిల్లీ బౌలర్లలో షిఖా పాండే&comma; మిను మనీ చెరో వికెట్ తీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …