ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వాడకం పై అవగాహన కల్పిస్తూ పార్టీలకు అతీతంగా గంజాయి వ్యతిరేక పాద యాత్ర కార్యక్రమాన్ని భారీ స్థాయిలోనిర్వహించారు. చంద్రగిరిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నాగాలమ్మ ఆలయం వరకు పాదయాత్ర సాగింది. దేశంలో మత్తు పదార్థాల వాడకంలో రాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంటే, రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని బడి సుధా యాదవ్ పేర్కొన్నారు. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత నిర్వీరమవుతున్నదని, అవగాహన కల్పిస్తూ ఈ పాదయాత్ర చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి టిడిపి తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు సుధాయాదవ్ తెలిపారు. చంద్రగిరి నియోజక వర్గంలో బీసీలు అధిక శాతం ఉన్నారని, దీనిని గుర్తించి బీసీ అభ్యర్థిగా తనకు ప్రాధాన్యత కల్పిస్తారని ఆశ భావo వ్యక్తం చేశారు. తాను చిన్నప్పటి నుంచి సేవాభావన్ని అలవర్చుకొని అనేక రకాల సంఘ సేవ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. కరోనా టైంలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రాజకీయంగా తనకు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గురువని అన్నారు. దీనిని గుర్తించే టిడిపిలో తాను టికెట్ ఆశిస్తున్నాను అని సుధా యాదవ్ పేర్కొన్నారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం…
78