టీడీపీ vs వైసీపీ (YCP attack on TDP):
కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం దండుపల్లె గ్రామంలో టీడీపీ TDP నాయకులపై వైసీపీ YCP నాయకుల దాడి. చిర్రాజు పల్లి గ్రామానికి చెందిన 12 మంది వైసీపీ నాయకులు రాత్రి దాడి చేయడంతో దండుపల్లె గ్రామానికి చెందిన వరపుత్రుడు, మహేష్ లకు తీవ్ర గాయాలు. గ్రామంలో పోలీస్ వికెట్టు ఉన్నా.. వైసీపీ నాయకులు లెక్కచేయకుండా టీడీపీ నాయకుల ఇళ్లపై కర్రలతో దాడి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి. దండుపల్లె గ్రామంలో పోలీసులు ఉండగానే ఇలాంటి ఘటన జరగడం దేనికి సంకేతమో పోలీసులు చెప్పాలన్న భూపేష్ రెడ్డి. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించిన భూపేష్.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.