Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home National సంచలనం సృష్టించిన లియాఖత్ అలీ ఆరోపణలు

సంచలనం సృష్టించిన లియాఖత్ అలీ ఆరోపణలు

by Satya
liyakhat ali chattha

ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ సీనియర్ అధికారి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడిక్కింది. దీంతో సోషల్ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా సీఈసీ, సీజే హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ దేశ ఎన్నికల కమిషన్ వీటిని తోసిపుచ్చింది. వీటిపై దర్యాప్తు చేయడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఈసీ సికందర్ సుల్తాన్ రాజా పాల్గొన్నారు. దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకుని మూడు రోజుల్లో నివేదికను ఎన్నికల కమిషన్ కు అందజేయనుంది. మరోవైపు ఈ ఆరోపణలను రావల్పిండి కమిషనర్ పూర్తిగా తోసిపుచ్చారు. తమ పాత్ర ఎన్నికల్లో కేవలం సమన్వయం వరకే పరిమితం అవుతుందన్నారు. ముఖ్యంగా సైనిక నాయకత్వం కొలువుదీరి ఉండే రావల్పిండిలో దాదాపు 13 మంది అభ్యర్థులను బలవంతంగా విజేతలుగా ప్రకటించామని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ ఛత్తా ఆరోపించడం సంచలనం సృష్టించింది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
    నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్…
  • తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
    తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025926
Total views : 149516

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.