చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద యువకుడి హత్య కలకలం రేపుతోంది. పలమనేరు సమీపంలోని గాంధీనగర్ దగ్గర పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన శివశంకర్ కొడుకు వినయ్ హత్యకు గురైనట్లు పోలీసులు సోమవారం గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన పలమనేరు పోలీసులు, పంచనామా అనంతరం ప్రభుత్వాసుపత్రి లోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ని ఎవరైన హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పలమనేరు మండలంలోని గడ్డూరికి చెందిన ఓ మహిళ ఆమె ప్రియుడుతో కలిసి ఈ హత్య చేసినట్లు సమాచారం అధికారులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి