కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పీసీసీ నేతలు. నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా లో మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించింది . ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్టిఏ ఎందుకు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కాంలో ఉంది. కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది . లేటుగా వచ్చినందుకు గ్రెస్ మార్కులు ఇచ్చామని సిగ్గు లేకుండా సమర్ధించు కుంటున్నారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయి . 67 మంది టాపర్స్ గా నిలవడం అస్సలు ఎలా సాధ్యం అవుతుంది .
ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ మీద లేదా . ఎన్నికల టైం చూసుకుని ఎన్టిఏ టైం చూసుకుని ఫలితాలు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక మీ హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి మోది జపం మానేసి పేపర్ లీక్ ఘటనపై సమాధానం చెప్పాలి . నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్,చంద్రబాబు సమాధానం చెప్పాలి .బీజేపీ ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. పేపర్ లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ జరిపి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ప్రశ్నించారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి