తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) రెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన అక్రమ పాలన జరుగుతుంది అవినీతి పాలన అక్రమ పాలనను అరికట్టించాలంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు, మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం నిషేధం చేయలేదు ప్రభుత్వం వారి మద్యం అమ్ముతున్నారు. హంద్రివనది,గాలేరు నది,తెలుగు గంగ కాలువను గత పది సంవత్సరాలుగా ఎలాంటి పనులు చేయలేకపోయారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగి ఇస్తాం, కంపెనీలు తెస్తామని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపి కాని వైసీపీ కనీసం 10 కంపెనీలు కూడా తేలేకపోయారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సత్యవేడు నియోజకవర్గంలో ఎక్కువగా ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం తన కొడుకు సుమన్ అక్రమాలకు వత్తాస పలికి ఈరోజు టిడిపి పార్టీలో టికెట్ తీసుకున్నారు మరి ఇప్పుడు టికెట్ తీసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాలతో పాటు కంపెనీలు,రైతులకు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ, ప్రతి గృహ మహిళలకు నెలకు 8500 చొప్పున ఇస్తామన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యవేడు నియోజకవర్గనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల గురవం బాబును నియమించా బాల గుర్రం బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.