తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అయినప్పటికీ ఏదైనా విద్యాసంస్థలో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులను తెలుసుకొని విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది కనీస సమాచారం లేకుండానే కళాశాలలో సభ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారు. భారీ మైకు మోతలు ఒకవైపు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళల రణగొణ ధ్వనులు మరోవైపు మోగిపోవడంతో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు అసహనానికి గురయ్యారు. వాస్తవానికి సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరగనున్నప్పటికీ ముందుగానే సభికులు, మైక్ సౌండ్లు ప్రారంభం కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లు వెల్లుతున్నాయి. 12 గంటలకు పరీక్ష పూర్తవుతున్నందున మధ్యాహ్న సమయంలో సభ నిర్వహించుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పరీక్షల సమయంలో వైయస్సార్ ఆసరా పంపిణీ సభ..
80
previous post