అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..

Advertisements

<p>అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&period; రైతన్నలు అధైర్యపడొద్దని&period;&period; అండగా ఉంటామని భరోసా కల్పించారు&period; అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు&period; అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు&period; భారీ గాలులు&comma; అకాల వర్షాలు&comma; వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు&period; 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4&comma;840 హెక్టార్లలో మొక్కజొన్న&comma; 1&comma;534 హెక్టార్లలో వరి&comma; 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు&period; వీటి విలువ రూ&period;40 కోట్లుగా అధికారులు తేల్చారు&period; 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1&comma;301 హెక్టార్లలో అరటి&comma; బొప్పాయి&comma; మిరప&comma; కూరగాయలు&comma; మామిడి&comma; ఆరెంజ్&comma; నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు&period; ఉద్యాన పంటల నష్టం విలువ రూ&period;22&period;68 కోట్లుగా అంచనా వేశారు&period;<&sol;p>&NewLine;<p>అలాగే&comma; ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు&period; భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు&period; ఇండక్షన్ స్టవ్‌లు&comma; పీఎన్జీ&comma; ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు&period; ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు&period; ఫెర్టిలైజర్లు&comma; పెట్రోల్&comma; డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు&period; గ్రామీణ&comma; గిరిజన ప్రాంతాలు&comma; విద్యాసంస్థలు&comma; ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.