కేసీఆర్ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, షాద్‌నగర్ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రె్‌సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు. వారి పాలనలో కరెంట్ లేక రైతులు, తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు. యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్, ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరి పోరాటమే చేసి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు
ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు
149
previous post