ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి లక్డారం వాసులఝలక్..

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేనే ఆఊరిని ఆగమాగం చేస్తున్నాడు&period; పేద&comma; బడుగు జీవులకు నీడగా నిలవాల్సిన ఆయనే&period;&period; వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు&period; క్రషర్ల పేరుతో ఆ ఊరంతా వల్లకాడు అవుతుంటే&period;&period; పట్టించుకోకుండా కాసులకు కక్కుర్తిపడి కోట్లు గడిస్తున్నాడు&period; దీంతో విసిగివేసారిపోయిన ఆ ఊరి జనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ సత్తా చూపిస్తామంటూ&period;&period; ఏకంగా 100 స్వతంత్ర నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు&period;హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం పేరుకు మిని ఇండియా&period;&period; ఇక్కడ దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు నివసిస్తుంటారు&period; దక్కణ్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని పటాన్ చెరు నియోజకవర్గంలో కొండలు&period;&period; గుట్టలు చరిత్రకు ఆనవాళ్లు… ఆ చారిత్రక ఆనవాళ్లను క్రషర్లతో కరిగించేస్తున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి&period;&period; పటాన్ చెరుకు 10 కిలోమీటర్ల దూరంలోని లక్డారం గ్రామంలో 50కి పైగా క్రషర్లు ఏర్పాటు చేసి&period;&period; రాత్రి&period;&period; పగలు అనే తేడా లేకుండా గుట్టల్ని పిండి చేస్తున్నారు&period; గుట్టలను పడగొట్టేటప్పుడు వచ్చే భారీ శబ్దాలతో గ్రామంలోని ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తుంటే&period;&period; దుమ్ము&comma; దూళి కారణంగా అనేక మంది శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రుల పాలయ్యారు&period; ఇంత జరుగుతున్న ఎమ్మెల్యేకు ఆ గ్రామ జనంపై కనికరం రాలేదు&period; ఇష్టానుసారంగా కొత్త కొత్త క్రషర్లకు అనుమతులు ఇప్పిస్తూ&period;&period; జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు&period; ఇదేంటని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు&period; దీంతో విసిగి వేసారని లక్డారం ప్రజలు 200 రోజులకు పైగా దీక్ష చేపట్టారు&period; అయినా ఫలితం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలను అస్త్రంగా మార్చుకున్నారు&period; గూడెం మహిపాల్ రెడ్డికి పోటీగా పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థులుగా 100 మంది లక్డారం నుంచి నామనేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వాయిస్<br>తమ గ్రామానికి జరిగిన అన్యాయాన్ని&comma; కాలుష్యంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకుని రావడానికి ఎన్నికల్లోపోటీ చేస్తున్నట్లు తేల్చి చెప్తున్నారు&period; లక్డారం పెద్ద చెరువు కింద కేఎస్ఆర్ మైనింగ్ క్రషర్ పనులను నిలిపివేయాలని గత 257 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష కేంద్రం నుంచి లక్షారం గ్రామస్తులు తమ పోరాటాన్ని ప్రకటించారు&period; లక్షారం గ్రామంలోని అన్ని వర్గాల<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రజలంతా ఏకమై అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యడం ద్వారా తమ నిరసన తెలపడానికి సిద్ధమయ్యామని తేల్చి చెప్పారు&period; ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ లక్షారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇష్టానుసారంగా క్రషర్లకు అనుమతులిస్తూ<br>తమ గ్రామాన్ని కాలుష్య బండగారంగా మార్చారని ఆరోపించారు&period; క్రషర్ à°² ద్వారా వెలువడే కాలుష్యంతో భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వ్యవసాయం కుంటుపడుతుందని&comma; ప్రజలు అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని&comma; పర్యావరణానికి తీవ్రవిఘాతం కలుగుతుందని ఆవేదనవ్యక్తంచేశారు&period; ఒకప్పుడు మండలంలోని పాడి పంటలతో అభివృద్ధి చెందిన గ్రామంగా ఉన్న లక్షారం క్రషర్లపుణ్యమా అని వెనకపడిందని బాధ పడ్డారు&period; గ్రామంలో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పెద్ద చెరువు విధ్వంసానికి గురయ్యేఅవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్