కాంగ్రెస్ నేతలకు షాక్..!

Congress

Advertisements

&NewLine;<p>హస్తం నుండి కొత్తగూడెం టికెట్ పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది&period; నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నా పొత్తుల పేరుతో తమను బలిచేసారని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; పోత్తులో కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాంచడంతో ఏళ్ళ తరబడి పార్టీ పటిష్టం కోసం కష్టబడుతున్న నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు&period; ఐదేళ్ల పాటు సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటూ వచ్చిన తమకు కాళీ చేతులు చూపించారని మండిపడుతున్నారు&period; పార్టీ బలంగా ఉన్న స్థానం పొత్తుల్లో ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు&period; ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పొత్తుల పేరుతో బీసీల గొంతు నొక్కారని మండిపడుతున్నారు&period; రాజీనామాలు అయినా చేస్తాము కానీ సీపీఐకి ససేమిరా మద్దతు తెలుపమని తెగేసి చెబుతున్నారు&period; కొత్తగూడెం లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ఆశావాహులు అధికంగానే ఉన్నా… తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని అధిష్టానానికి మూకుమ్మడిగా విజ్ఞప్తి చేశారు&period; అయినా అధిష్టానం సీపీఐ కే టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతోంది &period; టీపీసీసీ సభ్యులు యెడవెల్లి కృష్ణ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నిలిచేందుకు సిద్దమవుతున్నారు&period; మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారిని కాదని నెల ముందు వచ్చిన వారికి పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందని యెడవెల్లి కృష్ణ వాపోతున్నారు&period; 2018 లోనూ ఈవిధంగానే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ తనను వదిలి వేరే అభ్యర్థికి టికెట్ కన్ఫామ్ చేసారని&comma; ప్రస్తుతం పొత్తుల పేరుతో తనకు మళ్లీ అన్యాయం జరుగుతుందని అందుకే కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగుతున్నారు&period; ఈ తరుణంలో రెబల్ అభ్యర్థిగా ఎడవెల్లి క్రిష్ణ కు కాంగ్రెస్ క్యాడర్ మద్దత్తుగా నిలిచేందుకు సిద్దమైంది&period; దీంతో పొత్తుల్లో సీటు దక్కించుకున్న సీపీఐ… పొత్తు ధర్మం పాటించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై ఒత్తిడి పెంచుతోంది&period; కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కి లాభం అంటూ హెచ్చరిస్తోంది&period; పొత్తుల్లో వచ్చిన ఒక్క సీటులో రెబల్ బెడద సీపీఐ ను కలవరపెడుతుంటే … తమకు పార్టీ అన్యాయం చేసిందనే ఆవేదన లో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!