కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth reddy counter to KTR

Advertisements

&NewLine;<p>రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు&period; బీఆర్ఎస్‌కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు&comma; పెన్షన్&comma; ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు&period; ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు&period; &&num;8216&semi;ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు… నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు… నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు… నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు… నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే…&&num;8217&semi; అని రేవంత్ పేర్కొన్నారు&period; నీలాంటి వాడిని చూసే… &&num;8216&semi;నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది&&num;8217&semi; అనే సామెత పుట్టిందని విమర్శించారు&period; కేటీఆర్&comma; బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు&period; లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..