94
చంద్రగిరిలో 5 గురు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొండచుట్టు ఉత్సవం కోసం శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నేతలు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనుమతులు లేవని ప్లెక్సీలు తొలగిస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీ ప్లెక్సీలు కూడా తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పంచాయితీ ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అనంతరం పోలీసుల సహకారంతో ప్లెక్సీలను తొలగించారు.