తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి&period; గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు&comma; మంత్రులకు మధ్య పలు అంశాలపై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది&period; అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం&period;&period; రెండేళ్లు దాటినా హామీలు అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు&period; ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పి సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని&period;&period;కానీ ఇప్పుడు ఆ ఫైలు ఎటు పోయిందని ప్రశ్నించారు&period; తొలి కేబినెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైందని అడిగారు&period; మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి కనిపెట్టేందుకు ఒక సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>అయితే కేటీఆర్ విమర్శలకు మంత్రి శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు&period; కేటీఆర్ ప్రభుత్వానికి సలహాలు&comma; సూచనలు ఇస్తారని అనుకున్నామని&period;&period; కానీ ఆయన ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు&period; ప్రధాని మోదీ దగ్గరకు కేటీఆర్ ఎన్నిసార్లు వెళ్లారో లెక్క తీయాలన్నారు&period; రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతామని&period;&period; ప్రధాని&comma; కేంద్ర మంత్రులను కలుస్తామని మంత్రి స్పష్టం చేశారు&period; ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్‌లా తాము ఢిల్లీకి వెళ్లడం లేదని అన్నారు&period; కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు&period; 2023 అసెంబ్లీ ఎన్నికల్లో&comma; పార్లమెంట్ ఎన్నికల్లో&comma; మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయింది బీఆర్‌ఎస్ అంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..