దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు.

Advertisements

<p>దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధితులైన లక్షలాది మంది విద్యార్థులు&comma; అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పీఎం మోదీ ఇంటిని ముట్టడించింది&period; విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ప్రధానమంత్రి నివాస ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది&period; శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్&comma; ప్రియాంకలతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా పెను దుమారం రేపింది&period; ఈ వార్త తెలిసిన వెంటనే స్వయంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని&comma; పోలీసులతో మాట్లాడి అరెస్టయిన నాయకులందరినీ విడిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై అణచివేత చర్యలకు పాల్పడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్టానం&comma; కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు&&num;8230&semi;&period; నీట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది&period; దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ భవన్‌à°² ముట్టడికి ఏఐసీసీ పిలుపునివ్వడంతో ఉద్యమం మరింత ఉధృతరూపం దాల్చింది&period; ఇందులో భాగంగా నేడు తెలంగాణ లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని TPCC నిర్ణయించింది&period; ఈ నిరసన కదనరంగంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు&comma; సీనియర్ నాయకులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలతో పాటు NSUI&comma; యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నాయి&period; లోక్ భవన్ ముట్టడి పిలుపుతో హైదరాబాద్ నగరంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును &period;&period; వారి అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు&period; ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ&comma; విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు&period; పేపర్ లీకేజీలపై స్పష్టమైన సమాధానం చెప్పలేక&comma; బాధ్యులపై చర్యలు తీసుకోలేక ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం వారి బలహీనతకు నిదర్శనమని విమర్శించారు&period; తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులంతా లోక్ భవన్ ముట్టడిని విజయవంతం చేసి&comma; కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన సెగ తగిలేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.

కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.