వేమూరు లోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఉమ్మడి తెలుగుదేశం -జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈరోజు వేమూరులోని వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వేమూరు నియోజకవర్గ సర్వ సభ్య సమావేశంలో నక్కా ఆనందబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మాట్లాడుతూ రేపు చిలకలూరిపేట లో జరగనున్నది.
ప్రజా గళం బహిరంగ సభకు ఆహ్వానం :
రేపు అనగా 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి లో జరగనున్న సభకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు,ఈ భారీ బహిరంగ సభకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
ఉమ్మడి పార్టీ ల సూపర్ 6 కార్యక్రమం గురుంచి అందరిలో చర్చ జరిగే విధానంలో అదేవిధంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసే విషయంలో ఇంటింటికి తిరిగి మనమందరం భాగస్వాములు కావాలి. రాబోయే రోజుల్లో ఎన్నికలలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ అభ్యర్థి గా పోటీచేయుచున్న నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ను వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను.
ఈ కార్యక్రంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త ఊసా రాజేష్ గారు, వేమూరు నియోజకవర్గం లోని అన్ని మండలాల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.