బన్నీ ఉత్సవంలో ప్రమాదం

devaragattu bunny festival

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది&period; దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ&comma; మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు&period; అనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు&period; ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా&comma; 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలబడ్డారు&period; తరతరాలు వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ కర్రల సమరంలో పెద్దఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు&period; ఓ చేతిలో కర్ర&period;&period; మరో చేతిలో దివిటీలు&period;&period; మది నిండా భక్తిభావంతో దేవరగట్టు మారుమోగింది&period; దేవతా మూర్తుల కోసం నెరణికి&comma; కొత్తపేట&comma; నెరణికితండా&comma; బిలేహాల్‌&comma; ఆలూరు&comma; ఎల్లార్తి&comma; సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది&period; పలువురు విచక్షణారహితంగా కొట్టుకుకోవడంతో సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు&period; ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది&period; క్షతగాత్రులకు ఆలూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు&period; కాగా&comma; బన్నీ ఉత్సవంలో ప్రమాదం చోటుచేసుకున్నది&period; కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు&period; ప్రమాదవశాత్తూ అది విరిగిపడటంతో గణేశ్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు&period; మరికొదరు గాయపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..