బార్లీ ఉపయోగాలు..

Barley

Advertisements

&NewLine;<p>బార్లీని కాల్షియం పదార్థాలతోను&comma; చిక్కుళ్లు&comma; మాంసం&comma; పాలు&comma; కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది&period; వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది&period; బార్లీలో జిగురు ఎక్కువ కనుక గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ కలిగినవారు బార్లీని తీసుకోకూడదు&period; బార్లీని గాలి చొరబడని&comma; తేమలేని డబ్బాల్లో చల్లగా&comma; చీకటిగా&comma; పొడిగా ఉండే జాగాలో నిల్వచేస్తే పోషక తత్వాలు దెబ్బతినకుండా కొన్ని నెలలపాటు తాజాగా ఉంటాయి&period; బార్లీకి నీళ్లు కలిపి ఉడికించినప్పుడు దానిలోని స్టార్చ్ రేణువులు నీటిని పీల్చుకొని మెత్తబడి ఉబ్బుతాయి&period; బార్లీని 140 డిగ్రీల ఫారిన్ హీట్‌కి మించి వేడి చేస్తూపోతే స్టార్చ్ రేణువులు విచ్చేదనం చెంది ఎమైసోడ్ ఎమైలోపెక్టిన్‌లు చుట్టుపక్కలకు తప్పించుకొని నీటి రేణువులు తమలో కలిపేసుకుంటాయి&period; ఈ కారణం చేతనే పల్చని సూప్‌కి బార్లీగింజలను కలిపితే చిక్కగా తయారవుతుంది&period; బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది&period; దీనిని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీగింజలను&comma; వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి&period; పియర్లింగ్ అనే ప్రక్రియలలో&comma; బార్లీగింజలపైనుండే పొరను తొలగిస్తారు&period; బార్లీగింజలను పిండిగా మరాడించినప్పుడు పైనుండే ఊకను లేదా తవుడును తొలగిస్తారు&period; అయితే బి-విటమిన్లు&comma; పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పై పొట్టులోనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీగింజలను యధాతథంగా వాడగలిగితేనే మంచిది&period; మాల్టింగ్ అనే ప్రక్రియలో బార్లీ గింజలను మొలకెత్తేలా చేస్తారు&period; ఈ ప్రక్రియలో సంక్లిష్ట పిండి పదార్థాలు &lpar;బీటాగ్లూకాన్స్&rpar; షుగర్స్‌గా మారతాయి&period; ఇలా సిద్ధంచేసిన మాల్టెడ్ బార్లీ గింజలను బీర్&comma; విస్కీ వంటి పులియబెట్టి చేసే పదార్థాల తయారీకి వినియోగిస్తారు&period; బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది&period; అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; ఇంకా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత&comma; నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది&period; బార్లీని రవ్వలాగా&comma; మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా&comma; తేలిగ్గా జీర్ణమవుతాయి&period; బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది&period; బార్లీలో ప్రోటీన్లు&comma; కార్పోహైడ్రేడ్లు&comma; కొవ్వు&comma; విటమిన్లు&comma; ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి&period; పిల్లలకు ఇచ్చే సూప్‌లలో&comma; పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి&comma; శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం