ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..

Advertisements

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు&period; టీ20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు&period; ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు&period; ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి&comma; మహమ్మద్ అజారుద్దీన్&comma; రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి&comma; తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; కాగా&comma; టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించారు&period; గ్రూప్ దశలో భాగంగా జరిగిన ఒక కీలక మ్యాచ్‌లో&comma; టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మ నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు&period; దీంతో తిలక్ వర్మకు కాంగ్రెస్ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి&period; హైదరాబాద్ నుంచి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన తిలక్ వర్మ&comma; సిరాజ్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది&period; సిరాజ్‌కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం&period; ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా&period;&period; ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.