రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో..

Raja Singh

Advertisements

&NewLine;<p>గోషామహాల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు&period; దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు&period; విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు&period; కాగా తుపాకులు&comma; కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే&period; అక్టోబర్ 16à°¨ రాజా సింగ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో విధ్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు పేర్కొన్నారు&period; నవరాత్రి దాండియా కార్యక్రమాలు&comma; వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వహకులను రాజాసింగ్ కోరారు&period; అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని&comma; ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు&comma; వీడియోగ్రాఫర్లు&comma; డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు&period; ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు&period; ఐపీసీ 153ఏ&comma; 295ఏ&comma; 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్