రాజ్ భవన్ కు వెళ్లిన – నారా లోకేశ్

Nara Lokesh

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు&period; పార్టీ నేతలతో కలిసి విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లిన నారా లోకేశ్ గవర్నర్ కు 8 పేజీల లేఖను అందించారు&period; అందులో చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలపై ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఉన్నాయి&period; ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని లోకేశ్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు&period; గవర్నర్ తో దాదాపు గంటకు పైగా సమావేశమైన లోకేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను సమగ్రంగా వివరించారు&period; వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని&comma; ప్రజల పక్షాన గొంతుక వినిపిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ&comma; జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు&period; చంద్రబాబు పెట్టిన ఏ ఒక్క కేసులోనూ ఆధారాలు లేవని&comma; ఆయనను ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలన్నదే వారి కుట్ర అని లోకేశ్ గవర్నర్ కు వివరించారు&period; రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోందని వెల్లడించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్